అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఇవ్వాలి
- నూతనంగా తెచ్చిన నియమాలు సవరించాలి
- తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు విరాహత్ అలీ
హైదరాబాద్, అక్టోబర్ 5(విజయక్రాంతి): అక్రిడిటేషన్ కార్డు(Accreditation card) అందించే ప్రస్తు తం నూతనంగా తీసుకువచ్చిన నియమాలను సవరించి హైదరాబాద్ మహానగర ప్రాంతంలో(Hyderabad Metropolitan Area) చాలా సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న అర్హులైన జర్నలిస్టులకు(Journalists) అక్రిడి టేషన్ కార్డులు అందించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కే విరాహత్ అలీ(K. Virahat Ali, President of the Telangana Working Journalists Union) విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సమాచార భవన్‌లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించిన సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు కె విరాహత్ అలీ ఆధ్వర్యం లో చైర్మన్‌ను జర్నలిస్టులు కలిసి వినతిపత్రం అందించారు.
ప్రస్తుత సవరణల వల్ల తాము అక్రిడిటేషన్ కార్డులు పొందలేకపోయామని తమ సమస్యను దృష్టిలో పెట్టుకొని నియమాలను సవరించి తమకు కార్డులు అందిం చాలని కోరారు. విరాహత్ అలీ మాట్లాడు తూ సుప్రసిద్ధ మరియు గుర్తింపు పొందిన వార్తాపత్రికలు, మీడియా సంస్థలతో పనిచేస్తున్న, అనుభవజ్ఞులైన, ఇతర అర్హతలు క లి గిన అనేక మంది పాత్రికేయులకు(Journalists) ప్రస్తుత సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయబడలేదన్నారు.
గతంలో అక్రిడేషన్ పొందిన వారు కూడా ప్రస్తుత నియమాలతో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా కార్డులు పొందలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రస్తుత అక్రిడిటేషన్ మార్గదర్శకాల ను సమీక్షించి, సంబంధిత నిబంధనలను తగిన వి ధంగా సడలించాలని ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కూడా తమకు మద్దతు తెలుపుతూ కార్డు రాని వాళ్లకు వాటిని అందించే మార్గాలు పరిశీలించాలని కోరింది అన్నారు. హైదరాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నగర సంయుక్త కార్యదర్శి మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడారు. వినతిపత్రం ఇచ్చి న వారిలో జర్నలిస్టులు బాలకృష్ణ, మాజీద్, సుధాకర్, శ్రీనివాస్, జనార్ధన్ తదితరులు ఉన్నారు.