గోపాల్ దీన్నే- సింగోటం లింక్ కెనాల్ నిర్మాణానికి శ్రీకరం

02-10-2026 | 10:49pm

తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు

వీపనగండ్ల అక్టోబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సెంటుకు గుంటకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యం అని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. శుక్రవారం వల్లభాపూర్ గ్రామ శివారులో సింగోటం గోపాల్ దీన్నే లింకు కెనాల్ కు భూమి పూజ చేశారు.

సుమారు 150 కోట్లతో నిర్మిస్తున్న ఈ లింకు కెనాల్ ను వచ్చే సంవత్సరం లోపు పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కాంట్రాక్టర్ ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి రైతుకు నాయం చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు భూములు కోల్పోతున్న రైతులు సంబంధిత అధికారులకు సహకరించి లింకు కెనాల్ పనులను త్వరగా పూర్తి చేయడానికి రైతులు సహకరించాలని మంత్రి జూపల్లి కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్. పర్యాటక శాఖ అధికారి నరసింహ. వీపనగండ్ల మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి మాజీ జడ్పిటిసి కృష్ణ ప్రసాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి బొల్లారం సర్పంచ్ సుదర్శన్ రెడ్డి సర్పంచ్ రామన్ గౌడ్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు బసవరాజ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి. గోపి. ప్రతాప్ రెడ్డి మహేష్ కానముని బాలపిరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు