పోషణతోనే సంపూర్ణ ఆరోగ్యం
30-09-2026 | 11:39pm
కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు మండలం(Kallur Mandal)లోని వెన్నవల్లి-1,2, ఉప్పగూడెం, లింగాల-1,2 అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు(Poshan Mahotsavams) నిర్వహించారు. పౌష్టికాహారం, రక్తహీనత నివారణ, బాల్యవివాహాల నిర్మూలన, తొలి వెయ్యి రోజుల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చిన్నారులను ప్రీ-స్కూల్కు పంపించాలని సూచించారు. కార్యక్రమాల్లో సామూహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాసం నిర్వహించారు. సీడీపీఓ నిర్మల జ్యోతి, సూపర్వైజర్ సుజాత,వెంకటమ్మ, సర్పంచులు కమ్మంపాటి లక్ష్మీ, మేము కృష్ణ, ఉపసర్పంచులు ఉప్పు నాగమణి, వెంకట్రావు, అంగన్వాడీ టీచర్లు ఝాన్సీ, కమలకుమారి, దుర్గా, స్వరూపరాణి, ఆశా కార్యకర్తలు, గ్రామదీపికలు, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.