బీసీ భవన్ స్థలం కేటాయింపుపై స్పందించిన ఖమ్మం జిల్లా కలెక్టర్
24-09-2026 | 03:52pm
సత్తుపల్లి. సెప్టెంబర్ 24. ( విజయ క్రాంతి ) సత్తుపల్లిలో బీసీ భవన్ (BC Bhavan in Sathupalli)నిర్మాణానికి స్థలం కేటాయించే విషయంలో గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న జాప్యాన్ని ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి తరఫున ఖమ్మం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేయడం జరిగింది. విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్ సత్తుపల్లి తహశీల్దార్‌కు ఫోన్ చేసి, బీసీ భవన్ స్థలానికి సంబంధించిన పూర్తి నివేదికను వీలైనంత త్వరగా అందజేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కి, సత్తుపల్లి తహశీల్దార్ కి మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులకు బీసీ సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో రాజులపాటి ఐలయ్య, పలగాని శ్రీనివాస్ గౌడ్, పుట్టబంతి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.