జాబ్ మేళా లో ఎంపికైన కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు

19-09-2026 | 09:55pm

కోదాడ సెప్టెంబర్ 20(విజయక్రాంతి): కోదాడలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా లో కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల (KITS Women's Engineering College)విద్యార్థినులు 50 మంది పైగా ఉద్యోగాలకు ఎంపికైనారు. ప్రముఖ ఐటీ కంపెనీస్ అయిన ఎల్ ఎం ఎస్ కార్పొరేట్ ఐటీ కంపెనీ, స్టాఫ్ఫింగ్ టైటాన్స్ కంపెనీ, జస్టిన్ జాబ్ గ్రూప్ కంపెనీ లలో విద్యార్థి నులు ఉద్యోగాలు సాధించారు.

మెగా జాబ్ మేళా లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అభినందించారు. బి అక్షిత,  కే ఇందిరా ప్రియదర్శిని , జ్ఞాన స్నిగ్ధ, సిహెచ్ సంధ్య, డి శ్రావణి, నాగ స్వరూప, ఉన్న లత,  ఎస్ రూపిక, ఏ. వెన్నెల, ఏ. లావణ్య, sk. లాల్ బీ, తహీ్రీన్ తబస్సుమ్ ఉద్యోగాలు సాధించారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ, టీపీవో పుష్ప లత, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు