కేసీఆర్ కు ఇక రిటైర్మెంటేనా?

02-10-2026 | 08:30pm

సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

మొకరంపుర, అక్టోబర్ 2 (విజయక్రాంతి): సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ భారీ సక్సెస్ కావడంతో బిఆర్ఎస్ నాయకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Former SUDA Chairman Komatireddy Narender Reddy) అన్నారు.

స్థానిక ముకరంపురలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రాబోయే ఎన్నికల్లో సిరిసిల్ల నుండి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయం కాబట్టి ఇక్కడి నుండి మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటిస్తే బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారని మొత్తం మీద భవిష్యత్తులో బిఆర్ఎస్ గెలిచే అవకాశం లేకున్నా ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకులంతా కలిసి కేసీఆర్ ఇక రిటైర్మెంటే అని చెప్పకనే చెప్పారని నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

కేసీఆర్ అందుకే ఫాంహౌస్ లో నుండి బయటకు రావడం లేదని అన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నాయకుల భూదోపిడి పై విచారణ జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల మీటింగులో ఆధారాలు చూపించలేదని బిఆర్ఎస్ నాయకులు బాద పడుతున్నారని అన్నీ ఆధారాలు ప్రజల ముందు ఉంచుతారని ముందున్నది మొసళ్ల పండుగ బిఆర్ఎస్ నాయకులకు ఎందుకంత తొందర అని నరేందర్ రెడ్డి మండిపడ్డారు.ఈ విలేఖరుల సమావేశంలో జీడి రమేష్,ఎండి చాంద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు