డిపార్ట్మెంటల్ క్రికెట్‌లో కోయగూడెం ఓసీ విజయం

22-09-2026 | 05:43pm

ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లందు ఏరియా రన్స్‌ అండ్‌ గోల్స్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న డిపార్ట్మెంటల్‌ క్రీడా పోటీ(Departmental Sports Competition)ల్లో భాగంగా మంగళవారం జరిగిన క్రికెట్‌ ఫైనల్‌లో కోయగూడెం ఓసీ (కేఓసీ) జట్టు విజేతగా నిలిచింది. జేకే-5 ఓసీ అండ్‌ ఎస్‌అండ్‌పీసీ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఏరియా జీఎం వి.కృష్ణయ్య విజేత జట్టును అభినందించారు.

క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఉద్యోగులు విధులతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలిపారు. విజేత కోయగూడెం ఓసీ, రన్నరప్‌ జేకే-5 ఓసీ అండ్‌ ఎస్‌అండ్‌పీసీ, జీఎం కార్యాలయ జట్ల నుంచి క్రీడాకారులను ఎంపిక చేసి ఒక జట్టుగా ఏర్పాటు చేసి, మణుగూరు ఏరియా జట్టుతో తదుపరి పోటీలో పాల్గొననున్నట్లు జీఎం తెలిపారు. కార్యక్రమంలో WPS&GA కోఆర్డినేటర్‌ కిషోర్‌, జనరల్‌ కెప్టెన్‌ బాబురావు, ఎంపైర్లు నితీష్‌, సంతోష్‌, రాజు, కౌశిక్‌, స్కోర్‌ నూనె శ్రీను, క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు