మాతా శిశు మరణాలు నివారించాలి

22-09-2026 | 10:46pm

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): జిల్లాలో మాతా శిశు మరణాలు(Maternal and infant deaths) సంభవించకుండా వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కె. హారిత(Collector K. Haritha) సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో డాక్టర్ నాగేందర్తో కలిసి వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతేడాది సంభవించిన ఐదు మాతా శిశు మరణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

గర్భిణులకు ప్రతినెలా వైద్య పరీక్షలు, స్కానింగ్ నిర్వహించడంతో పాటు పోషకాహారం అందించాలని సూచించారు. రక్తహీనత ఉన్నవారిని గుర్తించి చికిత్స అందించాలని, హైరిస్క్ గర్భిణులను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు. సమావేశంలో వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు