గేమ్ అభివృద్ధికై క్రాఫ్టన్ ఇండియా గేమింగ్ ఇంక్యుబేటర్

24-09-2026 | 09:07pm

బెంగళూరు: క్రాఫ్టన్ ఇండియా గేమింగ్ ఇంక్యుబేటర్(Krafton India Gaming Incubator) యొక్క కోహోర్ట్ 4 ప్రారంభాన్ని క్రాఫ్టన్ ఇండియా ఈరోజు ప్రకటించింది మరియు దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా అదే రోజు ప్రారంభమైంది.

2023లో ప్రారంభమైన కేఐజీఐ ఆర్థిక సహాయం, నిపుణుల మార్గదర్శకత్వం మరియు ప్రపంచ స్థాయి ప్లాట్ ఫాంస్ కు అవకాశాలను కల్పించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న స్టూడియోలకు మద్దతును ఇస్తూ, అభివృద్ధి చెందుతున్న ప్రతిభావంతులకు ఒక వేదికగా నిలిచింది. కేఐజీఐ కోహోర్ట్ 4తో, కార్యక్రమం తాను మద్దతు చేసే గేమ్స్ యొక్క పరిధి విస్తరిస్తూనే, ప్రారంభ దశ టీమ్స్ మరియు ఆలోచనలకు తమ వాగ్థానాన్ని కొనసాగిస్తోంది.

సంప్రదాయబద్ధమైన ఇంక్యుబేటర్ వలే కాకుండా, కేఐజీఐ పరిణితి చెందిన టీమ్స్ పై మాత్రమే కాకుండా, పరిణితి చెందిన గేమ్స్ పై కూడా దృష్టి కేంద్రీకరించింది, దీనితో పాటు అభివృద్ధి యొక్క ప్రారంభపు దశలలో ఉన్న గేమ్స్ మరియు టీమ్స్ కు కూడా ప్రాధాన్యతనిచ్చింది. కేఐజీఐ కోహోర్ట్ 4తో, ఇది ఇప్పుడు తమ అభివృద్ధి ప్రయాణంలో మరింత ముందుకు కొనసాగిన టైటిల్స్ కు కూడా విస్తరించింది: మొబైల్ గేమ్స్ కోసం, ఇప్పటికే బీటా లేదా సాఫ్ట్ లాంచ్ లో ఉన్న ప్రాజెక్టులు ఉంటాయి.

పీసీ గేమ్స్ కోసం, కమ్యూనిటీ నుండి ఇప్పటికే ప్రోత్సాహకరమైన ప్రతిస్పందనను పొందుతున్న లైవ్ స్టీమ్ డెమో ఉన్న టైటిల్స్ ఉంటాయి. కేఐజీఐ యొక్క మొదటి ఎడిషన్ గా ఉన్న కారణంగా ప్రారంభపు-దశ టీమ్స్ మరియు భావనలు కోహోర్ట్ లో భాగంగా ఉంటాయి.

అనుజ్ సహాని, క్రాఫ్టన్ ఇండియా ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ ప్రధాన అధికారి ఇలా అన్నారు, “క్రాఫ్టన్ ఇండియా గేమింగ్ ఇంక్యుబేటర్ ద్వారా, అంతర్జాతీయ పోటీయుత టైటిల్స్ ను రూపొందించడానికి అవసరమైన వనరులు మరియు మార్గదర్శకత్వంతో భారతదేశపు అత్యంత విజయవంతమైన గేమ్ అభివృద్ధికారులకు మద్దతు ఇవ్వడమే ఎల్లప్పుడూ మా లక్ష్యంగా ఉంది.

కేఐజీఐ కోహోర్ట్ 4తో, మేము ఆ మద్దతును విస్తరిస్తున్నాము, ప్రారంభపు దశలోని  ఆలోచనలకు మరియు కొత్త టీమ్స్ కు ఎప్పటిలాగే  ప్రోత్సహిస్తూనే, అభివృద్ధిలో ఇప్పటికే కొంత విజయం సాధించిన గేమ్స్ కు కూడా మేము మద్దతునిస్తున్నాము. ఇందులో ప్రారంభంలోనే మంచి ఆదరణ పొందుతున్న మొబైల్ గేమ్స్ లేదా క్రీడాకారులు మరియు కమ్యూనిటీ నుండి ఇప్పటికే గుర్తింపు పొందుతున్న గేమ్స్ వంటివి ఉన్నాయన్నారు.

మరిన్ని వార్తలు