6 September, 2026 | 4:23 PM

దుబాయ్‌లో జరిగే జీటీఎఫ్ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్‌కు ఆహ్వానం

06-09-2026 | 02:33pm

రామారెడ్డి, సెప్టెంబర్ 07 (విజయ క్రాంతి): గల్ఫ్ తెలంగాణ ఫోరం (GTF) ఆధ్వర్యంలో అక్టోబర్ 11న దుబాయ్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)ను జీటీఎఫ్ ప్రతినిధి బృందం ఆహ్వానించింది. ఎల్లారెడ్డి(Yellareddy) నియోజకవర్గానికి చెందిన జీటీఎఫ్ ఫౌండర్, అధ్యక్షుడు ఆకుల సురేందర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేటీఆర్‌ను కలిసి ప్రత్యేక ఆహ్వానం అందించింది.

గల్ఫ్ దేశాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నామని ఆకుల సురేందర్ తెలిపారు. ఈ ఏడాది కూడా దుబాయ్‌లోని తెలంగాణ ప్రజలు, మహిళలు, యువత, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్(KTR) హాజరైతే ప్రవాస తెలంగాణ సమాజంలో మరింత ఉత్సాహం, ప్రోత్సాహం కలుగుతుందని జీటీఎఫ్ ప్రతినిధులు తెలిపారు.

మరిన్ని వార్తలు