భూ రీ సర్వేను సకాలంలో పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ అంకిత్
చుంచుపల్లి, సెప్టెంబర్ 30(విజయక్రాంతి ): చుంచుపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit) బుధవారం విస్తృతంగా పర్యటించి భూ రీ సర్వే ప్రక్రియను పరిశీలించడంతో పాటు ముందుగా చుంచుపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, సర్వే పురోగతి, భూ సరిహద్దుల నిర్ధారణ, రికార్డుల పరిశీలనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
చుంచుపల్లి గ్రామ పరిధిలో మొత్తం 2 వేల 27 ఎకరాల 30 గుంటల భూమి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ భూములతో పాటు వ్యవసాయ భూముల భూ రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో భూ సరిహద్దులను ఖచ్చితంగా నిర్ధారించడంతో పాటు, సంబంధిత రికార్డులను సమగ్రంగా పరిశీలించి భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
భూ రీ సర్వేను సకాలంలో పూర్తి చేయడంతో చేపట్టాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ నాగరాజు, సర్వే అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.