లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
19-09-2026 | 12:10am
మందమర్రి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని ఎల్లందు క్లబ్ లాన్ టెన్నిస్ కోర్టులో 62వ వార్షిక క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో భాగంగా లాన్ టెన్నిస్ పోటీలు(Lawn tennis competitions) శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా కేకే ఏజెంట్ ఎం.డి. ఖదీర్, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను పెంపొందించుకుని కోల్ ఇండియా స్థాయిలో రాణించి సింగరేణికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.