ఘనంగా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

02-10-2026 | 08:11pm

లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ....

నేరేడుచర్ల,అక్టోబర్ 02(విజయ క్రాంతి): నేరేడుచర్లలో లయన్స్ క్లబ్ (Lions Club Nereducherla)ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు షేక్ యూసుఫ్ అధ్యక్షతన మహాత్మా గాంధీ జయంతి, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా చైర్‌పర్సన్ లయన్ బట్టు మధు పాల్గొని మాట్లాడుతూ, మహాత్మా గాంధీ అహింసా మార్గంలో సాగించిన స్వాతంత్ర్య పోరాటం, లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి ఆశయాలను, విలువలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణ, పట్టుదలతో విద్యను అభ్యసిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి సరికొప్పుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు గుండా సత్యనారాయణ, జీఎంటీ కోఆర్డినేటర్ లాయర్ విశ్వనాథ్, ఉపాధ్యాయులు సైదులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు