జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఎన్నిక

02-10-2026 | 10:40pm

అధ్యక్షుడిగా ఎన్ రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎల్ సత్య ప్రసాద్

మేడిపల్లి, అక్టోబర్ 02 (విజయక్రాంతి): గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం మేడ్చల్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం(Gazetted Headmasters Association) మేడ్చల్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భౌరంపేట ప్రధానోపాధ్యాయులు ఎం రాంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడిపల్లి ప్రధానోపాధ్యాయులు ఎల్ సత్య ప్రసాద్ ను ఎన్నుకోవడం జరిగింది. వారితోపాటు రాష్ట్ర కౌన్సిలర్ గా ఎస్ అరుణ్ జ్యోతి, ఎల్ సి గోపాల్ కోశాధికారి గా వరలక్ష్మి ,గౌరవ అధ్యక్షులుగా శ్రీనివాస ప్రభాకర్ ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి,కోశాధికారి ,పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు