దళిత యువకుడిపై దాడి

30-09-2026 | 09:32pm

దళిత యువకుడిపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి 

మాదిగ దండోరా జిల్లా ఇన్చార్జ్ చెన్నూరి శ్రీనివాస్ 

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఓ కిరాణా షాపులో పనిచేస్తున్న దళిత యువకుడు చిలుక ఉదయ్(Dalit Youth Uday)పై దాడి చేసిన వారిని తక్షణమే పోలీసులు అదుపులోకి తీసుకోవాలని మాదిగ దండోరా(Madiga Dandora) పెద్దపెల్లి జిల్లా ఇంచార్జ్ చెన్నూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

బుధవారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కావాలని పట్టణానికి చెందిన యువతితో తనకు జ్వరంగా ఉందని ఉదయ్ కి ఫోన్ చేపించి పకడ్బందీ ప్రణాళికతో కొంతమంది కిడ్నాప్ చేసి నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి విచక్షణ రహితంగా కర్రలు, రాడ్లు తో దాడి చేశారని వారు ఆరోపించారు.

ఉదయ్ పై దాడి చేసిన వారందరినీ వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు, ఈ విలేకరుల సమావేశంలో  దళిత సంఘం నేతలు కన్నూరి ప్రభాకర్, సంకినపల్లి లక్ష్మయ్య, తిప్పారపు దయాకర్, క్యా దాసి దాసి చంద్రమౌళి, లక్ష్మణ్, చిలుక రాజేశం, ఆరెపల్లి కిరణ్, న్యాతరి ప్రభాకర్, రాకేష్, ఈలే రావు తో పాటు పెద్ద సంఖ్యలో దళితుల పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు