పోలీస్ స్పోర్ట్స్ మీట్లో సత్తా చాటిన డీఎస్పీలు
మహబూబాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ పోలీస్ అకాడమీ, హైదరాబాద్‌లో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్(Telangana Police Meet)లో టెన్నిస్ పోటీల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయం(Mahabubabad District Police Office)లో విధులు నిర్వహిస్తున్న ఏ.ఆర్. డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్ ప్రతిభ కనబరిచి ఒక బంగారు, రెండు రజత పతకాలు సాధించారు.
సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో టెన్నిస్ విభాగంలో డబుల్స్‌లో బంగారు పతకం, ఓపెన్ సింగిల్స్‌లో రజత పతకం, ఓపెన్ డబుల్స్‌లో రజత పతకం సాధించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన ఏ.ఆర్. డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ పతకాలను పరిశీలించి, డీఎస్పీలను అభినందించారు.