అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

02-10-2026 | 08:58pm

ఏడుపాయల దేవస్థానం మాజీ ధర్మకర్త మాలిస్ నాగప్ప మృతి పార్టీకి తీరని లోటు

పాపన్నపేట,అక్టోబర్02: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, ఏడుపాయల దేవస్థానం మాజీ ధర్మకర్త మాలిస్ నాగప్ప మృతి పార్టీకి, ముద్దాపూర్‌ గ్రామానికి తీరని లోటని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి(Former Medak MLA Padma Devender Reddy) పేర్కొన్నారు. అనారోగ్యంతో నాగప్ప శుక్రవారం మృతి చెందగా విషయం తెలుసుకున్న పద్మా దేవేందర్‌రెడ్డి ముద్దాపూర్‌ గ్రామానికి చేరుకుని నాగప్ప పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నాగప్ప చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ బలోపేతానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలకు అండగా నిలిచారన్నారు. నాగప్ప కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

అంతక్రియల్లో ఏడుపాయల మాజీ చైర్మన్‌ పట్లోళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు గంగుల విష్ణువర్ధన్‌రెడ్డి, మండల సీనియర్‌ నాయకులు బాబాగౌడ్, కుబేరుడు, సర్పంచ్‌ సాయిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు బద్రి మల్లేశం, ఏడుపాయల మాజీ డైరెక్టర్లు అంటోని, ప్రభుగౌడ్, సంగప్ప, గౌరీశంకర్, మంద నాగయ్య, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు దుర్గయ్య, బీస గోపాల్, అనిల్‌రెడ్డి, యేసురత్నం, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు