20 August, 2026 | 1:42 AM

మందుబాబులకు అడ్డాగా మల్కాజిగిరి!

20-08-2026 12:00 AM
  1. విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు
  2. జోరుగా బెల్ట్, గుట్కా, పాన్‌మసాల షాపుల నిర్వహణ
  3. కొరవడిన పెట్రోలింగ్ నిఘా

మల్కాజిగిరి, ఆగస్టు 19 (విజయక్రాంతి): మల్కాజ్గిరి, నేరేడ్మెట్, వినాయకనగర్, మౌలాలి, డివిజన్‌లలో పలు ప్రాంతాలు మందు బాబులకు అడ్డగా మారిపోయాయి.  ఏ గల్లిలో చూసినా బ్లాక్‌లో  మందు అమ్మడం తో మందు బాబులకు వరంగా మారింది.  పలు ప్రాంతాల్లో గంజాయి వ్యాపారం మూ డు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతుం ది. గంజాయికి యువకులే టార్గెట్‌గా  మారుతున్నారు. దీంతో బీద, మధ్యతరగతి కుటుంబాలు చిన్నా భిన్న మవుతున్నాయి.

వాజ్పేయినగర్ రైల్వే గేటు దగ్గరలో  గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో అక్రమ బెల్ట్ షాపులతో పాటు, గుట్కా, పాన్ మసాలా, ఇతరత్రా మత్తు పదార్థాల స్థావరాలు విచ్చలవిడిగా చలామణిలో ఉండడం తో మద్యం, గంజాయి, గుట్కా, పాన్ మసాలాకు యువత బానిసలవుతూ తమ జీవితా లను నాశనం చేసుకుంటున్నారు.

పోలీసులు సరైన నిఘా కొరవడడం, కొందరు పోలీసులు  నిర్వాహకుల వద్ద అమ్యామ్యాలకు అలవాటు పడడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డులేకుండా పోతుం ది.  గంజాయి మత్తులో ఆకతాయిల వికృత చర్యలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మధ్యాహ్నం నుంచే..

కొన్ని ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ ల తి ష్ట మధ్యాహ్నం నుంచే ఆరంభం అవుతుంది. మరి కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం, అర్ధరా త్రి వరకూ  ప్రధాన కూడళ్లలో, ఇండ్ల ముం దు అరుగులపై కూర్చొని వచ్చిపోయే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రభస చేస్తున్నారని ఇదేమని అడిగితే ఇది మీరెవరు మమ్మల్ని అడగడానికి అంటూ బూతులతో ఘర్షణలకు దిగుతున్నారని వాపోతున్నారు.  ఇకనైనా వీరి ఆగడాలకు అడ్డుకట్టు వేయకపోతే రాబోయే రోజుల్లో అకృత్యాలు జరిగే  ప్రమాదం ఉందని స్ధానికులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.