బెదిరింపు వాయిస్‌ మెసేజ్‌ వ్యక్తి అరెస్ట్

23-09-2026 | 10:30pm

రుద్రంగి సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): వినాయక నిమజ్జనం(Vinayaka Immersion) సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్‌ మీడియాలో బెదిరింపు వాయిస్‌ మెసేజ్‌ పంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చెందిన మోతే నితిన్‌ (24) నిమజ్జనంలో లా అండ్‌ ఆర్డర్‌ సమస్య సృష్టిస్తానని, తనతో గొడవ పెట్టుకున్న వారిని చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై రుద్రంగి ఎస్సై మోతీరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం అంబేద్కర్‌ విగ్రహం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన నితిన్‌ను అదుపులోకి తీసుకుని, బెదిరింపు వాయిస్‌ మెసేజ్‌ రికార్డు చేసిన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపుల్లో చట్టవ్యతిరేక సందేశాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చందుర్తి సీఐ కె.రవీందర్‌ హెచ్చరించారు. పండుగల సమయంలో ప్రజలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

మరిన్ని వార్తలు