మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

23-09-2026 | 08:52pm

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పిఎంఎస్హెచ్ఆర్ఐ జడ్పిహెచ్ఎస్ బొల్లారం పాఠశాలలో క్రీడా ప్రాంగణంలో బుధవారం అండర్ 14 (u -14) బాలుర మరియు బాలికల మండల స్థాయి క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ, పిడి సుకుమార్,జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థుల మానసిక ఉల్లాసానికి, శరీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతా విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికే ఈ మండల స్థాయి పోటీలు నిర్వహించినట్లు ఎంఈఓ వెంకట్ రెడ్డి తెలిపారు.క్రీడా స్ఫూర్తితో ఆడి గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

అండర్ 14 విభాగం పోటీలో మండలంలోని వివిధ పాఠశాలకు నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.కోకో బాలుర, బాలికల విభాగంలో జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆటగళ్ళు డైవింగ్లు,డిస్పెన్స్ వ్యూహాలు ఆకట్టుకున్నాయి.కబడ్డీ రైడర్లు,క్యాచలరు తమ ప్రతిభను కనబరుస్తూ పాయింట్ల కొరకు హోరా హోరీగా పోరాడారు. వాలీబాల్ నెట్టు వెంబడి స్మాష్లు,సర్వీసులతో మ్యాచులు ఉత్కంఠ భరితంగా కొనసాగాయి.ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నేడు అండర్ 17 బాలుర, బాలికల విభాగాల పోటీలు ప్రారంభమవుతాయని ఎంఈఓ వెంకటరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు