మణుగూరు ఆర్టీసీ సర్వీసులు పెంచాలి

03-10-2026 | 09:43pm

- పీవీ కాలనీ మీదుగా తెల్లవారుజామున బస్సులు నడపాలి

- తిరుపతి బస్ సర్వీస్‌ను పాత సమయానికి పునరుద్ధరించాలి

మణుగూరు, అక్టోబర్ 3,(విజయక్రాంతి ): కార్మికులు(Workers), వారి కుటుంబాల ప్రయాణ సౌకర్యార్థం మణుగూరు ఆర్టీసీ బస్సు సర్వీసులను(Manuguru RTC bus services) పెంచాలని ఏరియా టిబిజికేఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి వెంకటేశ్వర్లు(Nagelli Venkateswarlu) కోరారు. ఈ మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యామ్ సుందర్‌కు వినతిపత్రం అందజేశారు.30 ఏళ్లుగా పీవీ కాలనీ మీదుగా తెల్లవారుజామున నడిచే తిరుపతి సర్వీస్‌ను పాత సమయానికే కొనసాగించాలని కోరారు.అప్పటివరకు ప్రత్యామ్నాయంగా ఖమ్మం బస్సును పీవీ కాలనీ మీదుగా నడపాలని విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల ఎక్స్‌ప్రెస్‌ను(Mancherial Express) సాయంత్రం 3:30 గంటలకు కొనసాగించాలని సూచించారు.

మణుగూరు–హైదరాబాద్‌కు ఉదయం డైరెక్ట్ ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరారు.మణుగూరు–కొత్తగూడెం మార్గంలో ఉదయం, రాత్రి వేళల్లో అదనపు ఎక్స్‌ప్రెస్ బస్సులు నడపాలని తెలిపారు. బస్సు సర్వీసులు పెంచితే కార్మికులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో ఆక్యుపెన్సీ పెరిగి ఆర్టీసీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మునిగేల నాగేశ్వరరావు, సుద్దాల సంపత్‌కుమార్, జంగం రాజ్‌కుమార్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు