సింగరేణి భూ సర్వే.. అంతా మాయ సర్వేనా?

03-10-2026 | 09:49pm

అసలు కంటే.. కొసర వాళ్లే ఎక్కువయ్యారా..?

- ఎకరం భూమిలో ఆరుగురు పేర్లట..!

- సర్వేల పేరుతో లక్షల రూపాయల వసూళ్ల ఆరోపణలు

మణుగూరు, అక్టోబర్ 3,(విజయక్రాంతి ): మణుగూరు సింగరేణి సంస్థకు(Manuguru Singareni Company) సంబంధించిన భూముల సర్వే వ్యవహారం ప్రస్తుతం పలు అనుమానాలకు తావిస్తోంది. భూ సర్వే(Land Survey) పేరుతో అసలు హక్కుదారుల కంటే అదనపు పేర్లు తెరపైకి వస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక ఎకరం భూమికి ఏకంగా ఆరుగురు పేర్లు నమోదు చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

దీంతో అసలు భూమి హక్కుదారులు(Land rights holders) ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూ సర్వే ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే పేరుతో కొందరు వ్యక్తులు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అసలు భూమి ఎంత..? సర్వేలో చూపించిన భూమి ఎంత..? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.భూముల వివరాలు, హక్కుదారుల పేర్లు బహిరంగంగా ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు.సర్వే ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన వారెవరైనా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ వ్యవహారం వెనుక అసలు దందాకు తెరలేపింది ఎవరు అన్నది చర్చనీయాంశంగా మారింది.పైరవీల పేరుతో అధికారులపై ఒత్తిళ్లు, బెదిరింపులు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.దీంతో సర్వే అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.భూముల విషయంలో ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా హక్కులు కోరుతుండటంతో వివాదాలు మరింత ముదురుతున్నాయి.

సర్వే రికార్డులు, పాత పట్టాలు, రెవెన్యూ రికార్డులు(Revenue records) సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.సింగరేణి భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.భూ సర్వేలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న అవకతవకలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

సర్వే పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై కూడా విచారణ జరపాలని కోరుతున్నారు.అర్హులైన భూ హక్కుదారులకు న్యాయం చేయడంతో పాటు అనర్హుల పేర్లను తొలగించాలని ప్రజలు అంటున్నారు.సర్వే ప్రక్రియను పూర్తిగా వీడియో రికార్డింగ్‌తో నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు.అధికారుల సమక్షంలో గ్రామసభలు నిర్వహించి భూముల వివరాలను వెల్లడించాలని కోరుతున్నారు.నిజమైన లబ్ధిదారులకు నష్టం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే జరిగిన సర్వేను మరోసారి ఉన్నతస్థాయి బృందంతో పరిశీలించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.అంతులేని సర్వేలో అసలు వాస్తవాలు బయటపడతాయా..? అన్న ఆసక్తి నెలకొంది.సింగరేణి యాజమాన్యం, రెవెన్యూ అధికారులు ఈ ఆరోపణలపై స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు