జిల్లా తెలంగాణ జన సమితి నూతన అధ్యక్షునిగా మారం లక్ష్మారెడ్డి
ఘట్ కేసర్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : మేడ్చల్ జిల్లా తెలంగాణ జన సమితి పార్టీ (Telangana Jana Samithi Party) నూతన అధ్యక్షులుగా ఘట్ కేసర్ పట్టణానికి చెందిన మారం లక్ష్మారెడ్డి (Maram Lakshma Reddy) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం నియామకపు పత్రాన్ని అందజేశారు. అలాగే పూర్తిస్థాయి కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా రెడ్డిపల్లి శ్రీనివాస్ తిరుమల్ రెడ్డి, బర్మోజు వెంకటాచారి, ప్రధాన కార్యదర్శిగా ఏర్పుల దయాకర్, కోశాధికారిగా సుమంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా జంగం రవికుమార్, లింగోల దయాకర్ గౌడ్, జాయింట్ సెక్రటరీలుగా గాండ్ల లక్ష్మణ్, పొలమోని బాల శివశంకర్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఇన్చార్జ్ పల్లె వినయ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకుపోవాలని కోరారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అశోక్ రెడ్డి, భద్రకామి ఆంజనేయులు, రాష్ట్ర యువజన విభాగం నాయకులు ఎర్ర వీరన్న, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.