6 September, 2026 | 6:20 PM

వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత వేడుకలు

06-09-2026 | 05:14pm

పెద్ద ఎత్తున పాల్గొన్న దంపతులు

సుల్తానాబాద్, సెప్టెంబర్ 6(విజయక్రాంతి): పెద్దపల్లి(Peddapalli) జిల్లా సుల్తానాబాద్(Sultanabad) పట్టణంలోని శ్రీ శివాలయం లో  శ్రావణమాసం చివరి ఆదివారం ను పురస్కరించు కొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండువగా జరిగాయి, శివాలయం చైర్మన్(Shiva Temple Chairman) అల్లంకి సత్యనారాయణ, అర్చకులు వల్ల కొండ మఠం రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సత్యనారాయణ స్వామి వ్రత వేడుకల్లో దంపతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

అర్చకులు రమేష్ దంపతులచే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించారు, ఈ కార్యక్రమం లో ప్రముఖ వ్యాపారవేత్త అల్లెంకి ఆనందం తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలుస్వీకరించారు, అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది

మరిన్ని వార్తలు