గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్
చిట్యాల, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 30వ గణపతి ఉత్సవాల్లో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్(Municipal Chairperson Pandiri Geetha Ramesh), వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు, కౌన్సిలర్లు నిమ్మనకోటి శ్రీనివాస్, దేశపాక లతా రాజేష్, కోనేటి ఎల్లయ్య పాల్గొని గణనాథుడిని దర్శించుకుని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ గీతా రమేష్ మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులతో మున్సిపాలిటీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం యువజన సంఘం నిర్వహించిన ముగ్గుల పోటీలను పరిశీలించి విజేతలకు చీరలను బహుమతులుగా అందజేశారు. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సంఘం బాధ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువశక్తి యువజన సంఘం అధ్యక్షుడు చింతపల్లి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు ఇబ్రహీం, ప్రధాన కార్యదర్శి మద్దిమధు, సంఘం సభ్యులు, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.