ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడిగా ఎండి ఆసిఫ్ అలీ
10-09-2026 | 03:34pm
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడిగా ఎండి ఆసిఫ్ అలీ నియమితులయ్యారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వెంకట్ స్వామి, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కులకు ఎండి ఆసిఫ్ అలీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఎన్ ఎస్ యుఐని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. విద్యార్థుల హక్కులు, సమస్యలపై అందుబాటులో ఉంటూ వారి తరఫున గొంతుకగా నిలుస్తానని ఎండి ఆసిఫ్ అలీ అన్నారు.