చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

10-09-2026 | 05:33pm

మహమ్మదాబాద్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి(Death anniversary of Chakali Ailamma) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు కే.ఎం. నారాయణ మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ పోరాటం(Telangana armed struggle)లో చాకలి ఐలమ్మ చేసిన వీరోచిత పోరాటం, ధైర్యసాహసాలు చిరస్మరణీయమని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి, ఆశయాలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు