‘మెడికవర్’ ఉచిత వైద్య శిబిరం
నోబుల్, నవ్య కాలేజీల్లో నిర్వహణ
హైదరాబాద్, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): దిల్సుఖ్నగర్(Dilsukhnagar)లోని నోబల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్(Noble Degree and PG College), నవ్య జూనియర్ కాలేజ్(Navya Junior College) విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది(Students, faculty, staff) కోసం మెడి కవర్ హాస్పిటల్స్(Medicover Hospitals) ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం(Free Medical and Health Camp) నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికవర్ వైద్య నిపుణులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు.
ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సలహాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్ర మం నోబల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, నవ్య జూనియర్ కాలేజ్ చైర్మన్ ఆర్. రాజేశ్వర్ రెడ్డి సహకారంతో, ప్రిన్సిపాల్ ఆర్పీఎస్. విఠల్, ప్రిన్సిపాల్ ఆర్ రేవతి విఠల్ సమన్వయంతో నిర్వహించారు. ఎం. వెంకటేష్, శారద, సం ధ్య కార్యక్రమంలో సహక రించారు.