మెగా రక్తదాన శిబిరం విజయవంతం
96 యూనిట్ల రక్తం సేకరణ
ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి
రక్తదాతలకు హెల్మెట్ లను అందజేసిన డి.యస్పి మధుసుధన్,సిఐ నరహరి
కామారెడ్డి సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ల సంయుక్త ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) 76వ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం మరియు ట్రాఫిక్ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిఎస్పి మధుసూదన్,సిఐ నరహరిలు మాట్లాడుతూ రక్తదాతలకు హెల్మెట్లు అందజేయడం అభినందనీయమని ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని,రక్తదాతలు ప్రాణదాతలే అని,సకాలంలో రక్తం అందకపోతే ఎంతోమంది ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని అన్నారు.
19 సంవత్సరాల నుండి రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్న కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులందరినీ అభినందించడం జరిగింది. ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007లో 35 మందితో ప్రారంభించబడిన రక్తదాతల సమూహం నేడు 3500 మందికి పైగా రక్తదాతలతో రాష్ట్రంలోనే అతిపెద్ద రక్తదాతల సేవ సమూహంగా ఆవిర్భవించడం జరిగిందని 19 సంవత్సరాల కాలంలో 30 వేల యూనిట్ల రక్తాన్ని, నాలుగు సంవత్సరాల కాలవ్యవధిలోనే తల సేమియా బాధిత చిన్నారులకు 4 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డును అందుకున్న ఏకైక సంస్థగా దేశంలోనే నిలవడం జరిగిందని అన్నారు.
యువతకు రక్తదానం పట్ల అవగాహన సదస్సులను నిర్వహిస్తూ రక్తదానం చేసిన రక్తదాతలకు హెల్మెట్లను అందజేయడం జరిగిందని ఇప్పటివరకు 4000 హెల్మెట్లను దాతల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా అందజేయడం జరిగిందన్నారు.ప్రతి సంవత్సరం మూడు సార్లు రక్తదానం చేసే రక్తదాతలకు అవార్డులను అందజేయడం జరుగుతుందని రక్తదాతలు చేసే సేవలు వెలకట్టలేనివి అని అన్నారు.రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన దాతలకు ప్రశంస పత్రాలను,హెల్మెట్లను అందజేసి అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో 96 మంది రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది.