ఉన్నత విద్యకు ఉపాధి లక్ష్యం కావాలి

04-10-2026 | 05:25am
  1. ప్రతి వర్సిటీలో స్టార్టప్‌లు, ఆవిష్కరణల కోసం ఇంక్యుబేషన్ సెంటర్: మంత్రి శ్రీధర్‌బాబు
  2. జేఎన్టీయూహెచ్‌లో వేడుకగా ‘రీచ్- 2026’ 

హైదరాబాద్/కూకట్‌పల్లి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): తరగతి గదికి, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా తగ్గించాలని విద్యా సంస్థలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu ) పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థ యువతలో ఆలోచనా శక్తిని పెంపొందించడమే కాకుండా, వారిలో నైపుణ్యాలను అందించేలా వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు చూపేలా సిద్ధం చేయాలని ఆకాంక్షించారు.

తెలంగాణ ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్‌ఈ) ఆధ్వర్యంలో శనివారం కుకట్‌పల్ల్లిలోని జేఎన్టీ యూహెచ్లో నిర్వహించిన ‘రీచ్ 2026’ (రిసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్‌మెంట్) సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తరగతి గది నుంచి భవిష్యత్ కెరీర్ వైపు, విద్య నుంచి నైపుణ్యాల వైపు, పరిశోధన నుంచి పారిశ్రామిక రంగానికి నిరంతర అనుసంధానం ఉండాలని మంత్రి పేర్కొన్నారు.

మన విద్యా వ్యవస్థ కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు అందించే విధానం నుంచి, విద్యార్థులకు ఆచరణాత్మక నైపుణ్యాలు అందించే దిశగా మారాలన్నారు. కోర్సు పూ ర్తయిన వెంటనే విద్యార్థి ఉద్యోగానికి అర్హత సాధించాలని, పట్టా చేతికి వచ్చే సమయానికే ఆ స్థాయి సన్నద్ధత ఉండాలని పునరు ద్ఘాటించారు. విద్యార్థులు, పరిశోధకులు తమ ఆలోచనలను స్టార్టప్‌లుగా, నూతన ఉ త్పత్తులుగా మలచడానికి వీలుగా ప్రతి విశ్వవిద్యాలయంలో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని మంత్రి సూచించారు. కరికులమ్ రూపకల్పన, ల్యాబ్‌ల నిర్వహణ, ఇంటర్న్‌షిప్‌లు, లైవ్ ప్రాజెక్ట్లు, పరిశోధనల్లో పరిశ్రమలు భాగస్వామ్యమవ్వాలని విజ్ఞప్తి చేశారు.

‘ఒక చేతిలో డిగ్రీ.. మరో చేతిలో నైపుణ్యం’ ఉండటమే మన నూతన ప్రామాణికం కావాలన్నారు. టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో 65 ప్రభుత్వ ఐటీఐలను రోబోటిక్స్, ఆటోమేషన్, ఇండస్ట్రీ 4.0 వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన కేంద్రాలుగా (ఏటీసీ) తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ద్వారా సరికొత్త విద్యా, నైపుణ్య వ్యవస్థను నిర్మిస్తున్నామని తెలిపారు. 

‘తెలంగాణ రైజింగ్ @2047’ లక్ష్యంతో ఉన్నత విద్యను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దడం, పరిశోధనల్లో ప్రతిభను పెంచడం, ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడంపై  చర్చించారు. కార్యక్రమంలో సైయెం ట్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ బీవీఆర్. మోహన్‌రెడ్డి, టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టీ కిషన్ కుమార్‌రెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్  కుమార్, ప్రొఫెసర్ పురుషోత్తం, వివిధ వర్సిటీల వీసీలు, 60కి పైగా ఉన్న త విద్యాసంస్థల ప్రతినిధులు,

పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాలు, పరి శ్రమల మధ్య భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనలు, స్టార్టప్‌లు, విద్యార్థులకు లభించే ఉపాధి అవకాశాల ప్రాతి పదికన మాత్రమే రీచ్ సదస్సు విజయాన్ని అంచనా వేయగలమని నిపుణులు అభిప్రాయపడ్డారు.          

మరిన్ని వార్తలు