గేటు బయట వేచి చూస్తున్నా సర్పంచులు

05-10-2026 | 09:24pm

అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు

సర్పంచులకు దక్కని గౌరవం 

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని కలెక్టరేట్ సమీకృత భవనంలో నిర్మల్ జిల్లా(Nirmal District)లోని వివిధ మండలాల్లో రూ.23.35 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) సోమవారం ప్రారంభం చేశారు. బాసరలో పుష్కరాల(Basara Pushkaralu) అభివృద్ధి పనులతో పాటు, ఆరోగ్య ఉప కేంద్రాలు, కమ్యూనిటీ భవనాలు అభివృద్ధి పనులు ఉన్నాయి.

అభివృద్ధి పనులపై ఫోటోకాల్ ప్రకారం అందరి పేర్లను అధికారులు చేర్చినప్పటికీ వారిని ఆహ్వానించగా ప్రారంభోత్సవం సందర్భంగా కొందరు సర్పంచులకు కలెక్టర్ కార్యాలయంలోకి రానివ్వకుండా అనుమతిని నిరాకరించారు. దీంతో వారు నిరాశత్వం కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు వద్దని ఉండిపోయారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులకు ఫోటో కాల్ నిబంధన ప్రకారం కచ్చితంగా గ్రామ సర్పంచ్ సమక్షంలో ప్రారంభోత్సవం చేయవలసి ఉన్నప్పటికీ కొందరు సర్పంచులకు అవకాశం దక్కకపోవడంతో నిరాశాలు గురయ్యారు. కనీసం మంత్రులను కలుద్దామన్న వారిని కలవనీయకుండా పోలీసులు అడ్డుకోవడం పై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు