చాయ్ త్రాగుతూ ముచ్చటించిన విప్ ఆది శ్రీనివాస్

03-10-2026 | 10:42pm

ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

చందుర్తి,అక్టోబర్ 03,(విజయక్రాంతి): మండలంలోని మల్యాల గ్రామంలో(Malyala Village) వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్(Vemulawada MLA Sri Adi Srinivas) పర్యటించారు. గ్రామ రైతులు(Village farmers), యువకులు, పలువురు నాయకులు, గ్రామ పెద్దలను ఆత్మీయంగా కలుసుకుని గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని నేను ఎల్ల వేళల అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

మీ సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గ్రామస్థులతో కలిసి తేనేటి విందులో ఆత్మీయంగా పాల్గొని, అందరితో సరదాగా ముచ్చటించారు. ప్రజల మధ్య కలిసిమెలిసి ఉంటూ, గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆది శ్రీనివాస్ అన్నారు.

మరిన్ని వార్తలు