ఇందిరమ్మ ఇళ్లపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

18-09-2026 | 01:20pm

సీఎం వ్యాఖ్యలను అధికారులు పట్టించుకోవడం లేదు

ఆ పార్టీ ఎమ్మెల్యేలంటే అధికారులకు భయం

హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లపై(Indiramma houses) ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాకుండానే అధికారులు డ్రా తీస్తున్నారని దానం ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నియోజకవర్గంలో మరో నియోజకవర్గం లబ్ధిదారులకు ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. 360 డిగ్రీస్ లో స్క్రూటినీ జరగాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని దానం గుర్తుచేశారు. సీఎం రేవంత్(CM Revanth Reddy) వ్యాఖ్యలను అధికారులు పట్టించుకోవడం లేదని సూచించారు. ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ ఇచ్చి మళ్లీ అవమానిస్తున్నారని తెలిపారు.

ఎంఐఎం ఎమ్మెల్యేల(MIM) నియోజకవర్గాల్లో ఇళ్ల కేటాయింపు సరిగ్గా జరగుతున్నాయని వెల్లడించారు. ఎంఐఎం ఎమ్మెల్యేలంటే అధికారులు భయం ఉందని పేర్కొన్నారు. అధికారుల తీరుపై ప్రివిలేజ్ నోటీసు(Privilege Notice) సైతం ఇచ్చానని దానం నాగేందర్ వెల్లడించారు. ప్రివిలేజ్ నోటీసు తనకు అందలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) తెలిపారు. అన్యాయంపై పోరాడాలని దానంకు సభ్యులు సూచించారు. పోరాడుతూనే  ఇక్కడి వరకు వచ్చానని దానం స్పష్టం చేశారు. ఇవాళ ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. ఇళ్ల కేటాయింపుపై దానం వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సమాధానం ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు ఉంటే సరిచేస్తామని హామీ ఇచ్చారు.


మరిన్ని వార్తలు