సెట్‌లో పీయూ విద్యార్థి అర్హత

18-09-2026 | 02:33pm

పాలమూరు యూనివర్సిటీ: పీయూ పీజీ కళాశాలలో(PU PG College) ఎకనామిక్స్‌ విభాగంలో పీజీ పూర్తి చేసిన నరేష్‌ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (State Eligibility Test)లో అర్హత సాధించారు. ఈ సందర్భంగా నరేష్‌ను పాలమూరు యూనివర్సిటీ(Palamuru University) ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్‌ అభినందించారు. సెట్‌లో అర్హత సాధించడం ద్వారా ఉన్నత విద్య, పరిశోధనతో పాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బోధనా వృత్తిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని తెలిపారు.

విద్యార్థులు పీజీ విద్యను పూర్తిచేసుకుని ఉన్నత విద్య, పరిశోధనపై దృష్టి సారించాలని సూచించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య పి. రమేష్‌బాబు విద్యార్థులు నిరంతరం చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ మధుసూదన్‌ రెడ్డి, విభాగాధిపతి డాక్టర్‌ వెంకట రాఘవేందర్‌, అధ్యాపకులు డా. జిమ్మీ కార్టన్‌, డాక్టర్‌ శివలింగం, డాక్టర్‌ రాజు తదితరులు నరేష్‌ను అభినందించారు.

మరిన్ని వార్తలు