పీయూలో ఘనంగా వినాయకుడి పూజలు
పాలమూరు యూనివర్సిటీ : పీయూలోని ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విభాగం(Integrated Chemistry Department)ఆధ్వర్యంలో న్యూ పీజీ బాయ్స్ హాస్టల్ సమీపంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడికి శుక్రవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్(Vice-Chancellor Professor G.N. Srinivas), రిజిస్ట్రార్ ఆచార్య పి. రమేష్‌బాబు, ప్రిన్సిపాల్ డా. డి. మధుసూదన్‌రెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ డా. రాజ్‌కుమార్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డా. ఎస్.ఎన్. అర్జున్‌కుమార్ పాల్గొని పూజలు నిర్వహించారు.
యూనివర్సిటీ అభివృద్ధి, విద్యార్థుల విద్యాభివృద్ధి, సుఖసంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం విద్యార్థులకు ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కోఆర్డినేటర్ డా. ఎస్. రవికుమార్, అధ్యాపకులు డా. రామ్‌మోహన్, డా. శ్రీధర్‌రెడ్డి, డా. సిద్ధా రామగౌడ్, డా. పండగ రామరాజు, బోధనేతర సిబ్బంది సత్యం, రఘు, అనిత గాయత్రితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.