పట్టణ అభివృద్ధి, చిరు వ్యాపారుల ప్రయోజనాలే ముఖ్యం
* ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు, అక్టోబర్ 3(విజయక్రాంతి): పట్టణ అభివృద్ధి పనుల వల్ల ఏ ఒక్క చిరు వ్యాపారికి నష్టం వాటిల్లకుండా, వారి జీవనోపాధికి రక్షణ కల్పిస్తూనే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(Kalwakurthy MLA Kasireddy Narayana Reddy) స్పష్టం చేశారు. శనివారం ఆమనగల్లు మున్సిపల్(Amanagal Municipality) కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన ఆయన, నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను(Construction work of new government hospital) పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
అనంతరం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారితో కలిసి చిరు వ్యాపారులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యాపారులకు అనువైన ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీపై వ్యాపారులు సంతృప్తి వ్యక్తం చేస్తూ అభివృద్ధికి సహకరిస్తామన్నారు.
అంతకుముందు అమంగల్ మున్సిపాలిటీ పరిధిలోని పెంట తండాలోరూ.70 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గీత, కౌన్సిలర్లు మహేష్, వెంకటయ్య, కోఆప్షన్ సభ్యుడు అల్లాజీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివలింగం, నాయకులు అలీమ్, బాబా, విజయ్, మహేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.