గణేషుడికి ఎంఎల్ఏ ప్రత్యేక పూజలు

25-09-2026 | 05:14pm

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : మంచిర్యాల పట్టణంలోని(Mancherial town) విశ్వనాథ స్వామి ఆలయం(Vishwanath Swamy Temple), లక్ష్మీ నారాయణ ఆలయంలలో(Lakshmi Narayana Temple) మంచిర్యాల ఎంఎల్ఏ కొక్కిరాల ప్రేంసాగర్ రావు(Kokkirala Premsagar Rao) శుక్రవారం గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణపతి నిమజ్జనం(Ganapati Immersion) భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ ఎగ్గడి భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షులు పూదరి తిరుపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గుండ సుధాకర్, కార్పొరేటర్లు , నాయకులు, గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు