అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బిఅర్ఎస్ నాయకులు

25-09-2026 | 07:30pm

చేగుంట సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : చేగుంట పట్టణ(Chegunta town) కేంద్రంలో బ్రదర్స్ యూత్(Brothers Youth) ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుడి సన్నిధిలో శుక్రవారం జిల్లా బిఅర్ఎస్ నాయకులు(District BRS leaders) రంగయ్య గారి రాజిరెడ్డి(Rangayya Gari Rajireddy), మండల బిఆర్ఎస్ నాయకులు పాల్గున్నారు, అనంతరం అన్నదాన కార్యక్రమంలో(Food Donation Program) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి ఉత్సవాల(Vinayaka Navaratri celebrations) సందర్భంగా భక్తిశ్రద్ధలతో పాటు పేదలకు, భక్తులకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యప్రదమైన కార్యమని కొనియాడారు.

చిన్నారులు  ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండడం అభినందనీయమన్నారు. . ఈ కార్యక్రమంలో  యూత్ సభ్యులు, నాయకులు ఎర్ర యాదగిరి, డిష్ రాజు, చేగుంట మహంకాళి ఆలయ ఉపాధ్యక్షులు  గుండ్ల సంపత్ కుమార్, గణేష్, ప్రశాంత్,అన్నం రవి . గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు