19 August, 2026 | 2:36 AM

బహుజనుల కేంద్రంగా మోదీ పాలన

19-08-2026 01:07 AM
  1. వారికి రాజ్యాధికారం ఇచ్చింది బీజేపీనే
  2. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో బీసీని ప్రధాని చేశారా?
  3. రాష్ట్రంలో బీసీ సీఎం అయ్యారా?
  4. కేబినెట్‌లో 42 శాతం బీసీ మంత్రులేరీ?
  5. సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం
  6. కేంద్ర మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, ఆగస్టు 18 (విజయక్రాంతి): దేశంలో బహుజనుల అభివృద్ధి, సంక్షేమమే కేంద్రంగా మోదీ ప్రభుత్వం పాల నను కొనసాగిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. బహుజనులకు రాజ్యాధికారం అప్పగించిన ఘనత కూడా బీజేపీదేనన్నారు. నరేంద్రమోదీకి ప్రధాని పదవి అప్పగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించు కుని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయ ర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, బీజేపీ కార్పొరేటర్లు, స్థానిక నేతలతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ రేకుర్తిలోని సర్దార్ సర్వా యి పాపన్న గౌడ్ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సామా న్య కల్లుగీత కుటుంబంలో పుట్టి నాటి మొగ ల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించిన అసామాన్యుడు, వెన్నుచూపని వీరుడు సర్దా ర్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. తాటిచెట్టు ఎక్కి కల్లుగీసే వృత్తి నుంచి గొల్లకొండ కోటపై జెండా ఎగరేసిన తొలి తెలుగు బహజన చక్రవర్తి, బహజనుల ఆశాదీపం సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్, సర్దార్ సర్వాయి పాపన్న దాదా పు సమకాలీనులే. ఇద్దరూ సామాన్య కుటుంబంలో పుట్టినోళ్లే.

మొఘల్ చక్రవర్తులను ఎదిరించి రాజ్యాలను స్వాధీనం చేసుకున్న  వాళ్లేనన్నారు. ఛత్రపతి శివాజీకి దేశ చరిత్రలో దక్కిన స్థానం సర్దార్ సర్వాయి పాపన్నకు దక్కకపోవడం బాధాకరం అన్నారు. కాగా దేశంలో బహుజనులకు రాజ్యాధికా రం అప్పగించిన ఘనత బీజేపీదేనని, బీసీ బిడ్డ నరేంద్రమోదీకి ప్రధాని పదవి అప్పగించడమే ఇందుకు నిదర్శనం అన్నారు. రా జ్యాంగబద్దంగా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ను ఏర్పాటు చేసి ఓబిసిలకు రాజ్యాంగపరమైన గౌరవం దక్కిందన్నారు.