కడియం కావ్యకు పార్లమెంటరీ పదవి

04-10-2026 | 05:15am

హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా నియామకం

వరంగల్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (Warangal MP Dr. Kadiyam Kavya)పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ డైరెక్టర్ (హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) భూపేంద్ర భాస్కర్ శనివారం ఎంపీ కడియం కావ్యకు అధికారిక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజారోగ్యం, వ్యాధుల నివారణ, క్యాన్సర్ స్క్రీనింగ్, ఆధునిక వైద్య సాంకేతికత, వైద్యసేవల అందుబాటు, ఆరోగ్య మౌలిక వసతుల బలోపేతం వంటి అంశాలలో కమిటీ ద్వారా జాతీయస్థాయిలో మరింత బలంగా ప్రస్తావించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు