సర్వమత సమ్మేళనం అని మరోసారి భిన్నత్వంలో ఏకత్వం

18-09-2026 | 11:23pm

-గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముస్లిం సోదరులు

హుజూర్ నగర్, సెప్టెంబర్ 18: భారతదేశం సర్వమత సమ్మేళనం అని మరోసారి భిన్నత్వంలో ఏకత్వం అని హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీనగర్ కాలనీ ముస్లిం సోదరులు నిరూపించారు. శుక్రవారం పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో మున్సిపల్ కౌన్సిలర్ అట్లూరి మంజుల హరిబాబు(Municipal Councilor Atluri Manjula Haribabu) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడికి హిందూ ముస్లిం సోదరులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరులు మాట్లాడుతూ... భారతదేశం అన్ని మతాలను కులాలను ఆదరిస్తుందని హిందూ ముస్లిం సోదరులు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పంటలు బాగా పండాలని తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కోరారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ పాలకవర్గం ప్రారంభించారు.

మరిన్ని వార్తలు