పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

04-10-2026 | 05:15am
  1. లీటర్‌పై పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంచిన నయారా 
  2. శనివారం అర్ధరాత్రి నుంచే అమలు
  3. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, జియో-బీపీలో స్థిరం

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: నయారా ఎనర్జీ పెట్రోల్(Nayara Energy Petrol) ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను రూ.3 మేర పెంచింది. ఈ ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయని శనివారం పేర్కొంది. అయితే ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, జియో-బీపీ మాత్రం ధరలను పెంచలేదు. అంతర్జాతీయంగా చమురు, శుద్ధి చేసిన ఉత్పత్తుల ధరలు పెరుగుతుండటం, వాటికి, రిటైల్ ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించే ఉద్దేశంతోనే ధరలు పెంచాల్సి వచ్చిందని నయారా చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం వల్ల విక్రయ సంస్థలపై ఒత్తిడి నెలకొన్న తరుణంలో ఈ తాజా పెంపు జరిగింది. దేశవ్యాప్తంగా 7,108 పెట్రోల్ పంపులను నిర్వహిస్తున్న నయారా, శనివారం తెల్లవారుజాము నుంచే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచినట్లు సమాచారం. ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లు దేశంలోని 1,04,137 పెట్రోల్ పంపులలో 90 శాతానికి పైగా నియంత్రిస్తున్నాయి.

అంతర్జాతీయ ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, ఈ కంపెనీలు చారిత్రాత్మకంగా పపెంపు ధరలను స్థిరంగా ఉంచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యూకేకు చెందిన బీపీ సంయుక్త ఇంధన రిటైలింగ్ జాయింట్ వెంచర్ అయిన జియో-బీపీ, 2,304 పెట్రోల్ పంపులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించలేదు.


మరిన్ని వార్తలు