పోషణతోనే ఆరోగ్యం.. ఆరోగ్యంతోనే అభివృద్ధి
30-09-2026 | 07:07pm
- ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ
- పోషణ మాసంలో పోషకాహారంపై అవగాహన
గణపురం, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి):పోషణతోనే ఆరోగ్యం.. ఆరోగ్యంతోనే అభివృద్ధని ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ(ICDS Supervisor Aruna) అన్నారు.మండల కేంద్రంలోని 4వ అంగన్వాడీ కేంద్రంలోసెక్టార్ స్థాయిలో పోషణ మాసం కార్యక్రమాన్ని బుధవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సమతుల్య ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన బాల్యం, తల్లి–శిశు ఆరోగ్యం సాధ్యమవుతుందని కార్యక్రమంలో వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. పోషణతోనే ఆరోగ్యం.. ఆరోగ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అరుణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని అంగన్వాడి కేంద్రాల టీచర్లు పాల్గొన్నారు.