అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి

19-09-2026 | 10:06pm

మహ ముత్తారం ఎంపీడీవో నిశాంత్ 

మహా ముత్తారం సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి): స్థానిక సమస్యల పరిష్కారంలో ఆయా గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని మహా ముత్తారం ఎంపీడీవో నిశాంత్ పేర్కొన్నారు. శనివారం నాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై మాట్లాడారు.

దీంతో ఎంపీడీవో ఆయా సంబంధిత అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారని సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు అందరూ సమన్వయంతో ఎందుకు సాగితేనే మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయని ఇప్పుడే వసూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకారి తిరుమల స్థానిక ఎమ్మార్వో శ్రీనివాస్ ఆయా శాఖల అధికారులు సర్పంచులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు