స్టోన్ క్రషర్ లపై ఫిర్యాదు చేసిన పట్టించుకొని అధికారులు
ఎల్లంపేట్ మున్సిపల్ కౌన్సిలర్ ల ఆరోపణ
మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 25(విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ(Yellampet municipal town) పరిధిలోని శ్రీరంగవరం,బండమాదారం, రెవెన్యూ పరిధిలో(Srirangavaram and Bandamadaram revenue limits) కొనసాగుతున్న రాక్ సాండ్ స్టోన్ క్రషర్(Rock and Sandstone Crusher), ఐజెఎం స్టోన్ క్రషర్ లకు సంబంధించిన క్వారీలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మున్సిపల్ కౌన్సిలర్ లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టోన్ క్రషర్ క్వారీలలో(Stone crusher quarries) బ్లాస్టింగ్ చేయడం వల్ల భారీగా రాళ్ళ తవ్వకాలు పేలుళ్లుStone quarrying and blasting, స్టోన్ క్రషర్ కార్యక్రాపాలతో స్థానిక ప్రజలు, రైతులు(Farmers) నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు.
శ్రీరంగవరం,బండమాదారం మున్సిపల్ పట్టణాల సమీపంలో గల రాక్ సాండ్ స్టోన్ క్రషర్ కుసంబంచిన క్వారీలో జరుగుతున్న బ్లాస్టింగ్ కారణంగా చుట్టు పక్కల ప్రాంతాలలోని పలు ఇళ్ళకు పగుళ్ళు ఏర్పడి,ఇండ్ల పై పెచ్చులు ఊడి కిందపడుతున్నాయని కౌన్సిలర్ లు స్పష్టం చేశారు.దీంతో ప్రజలు ఇళ్లల్లో ఉండేందుకు భయపడుతున్నారని వారు వాపోయారు.అదేవిధంగా ఐజెఎం స్టోన్ క్రషర్ కు సంబంధించిన క్వారీలో బ్లాస్టింగ్ కారణంగా భారీగా రాళ్ళ తవ్వకాలు జరుగుతున్నాయని కౌన్సిలర్ లు వెల్లడించారు.
అంతేకాకుండా క్వారీలలో సుమారు 200 నుండి 300 అడుగుల లోతు వరకు బ్లాస్టింగ్ చేస్తూ తవ్వకాలు జరుగుతున్నాయని రాళ్ళ తవ్వక ప్రాంతాల చుట్టు తగిన రక్షణ లేకపోవడంతో స్థానిక ప్రజలు,రైతులు,పశువులు భద్రతపై ఆందోళన చెందుతున్నారని ఎల్లంపేట్ మున్సిపల్ కౌన్సిలర్ లు మొత్తుకుంటున్నారు.స్టోన్ క్రషర్ లకు సంబంధించిన వాహనాల రాకపోకలతో రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయని,ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు తెలిపారు.
స్టోన్ క్రషర్ కార్యకలాపాల కారణంగా దుమ్ము,ధూళి,కాలుష్యం పెరిగి స్థానికులు ఆరోగ్య రీత్యా అవస్థ పడుతున్నారని మున్సిపల్ కౌన్సిలర్ లు తెలియజేశారు.రాక్ సాండ్,ఐజెఎం స్టోన్ క్రషర్ లకు సంబంధించిన క్వారీలలో ప్రభుత్వ అనుమతులు,రెవెన్యూ హద్దులు,తవ్వకాల పరిమితులు,భద్రత ప్రమాణాలు,పర్యావరణ నిబంధనలను సంబధిత అధికారులు సమగ్రంగా పరిశీలించాలని కౌన్సిలర్ లు కోరారు.స్థానిక ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్,మైనింగ్ అధికారులు,రెవెన్యూ అధికారులు అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ లు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లు కత్తి వరలక్ష్మి.సురేందర్.దాది నరసింహా.ఓంప్రకాష్ గౌడ్.లు పాల్గొన్నారు..
1) ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ క్వారీలలో బ్లాస్టింగ్ కారణంగా భారీగా తవ్విన గుంతలు..
2)స్టోన్ క్రషర్ క్వారీల వాహనాల రాకపోకలతో రోడ్లు గుంతలమయంగా మారాయి..