గంగమ్మ ఒడికి చేరిన బొజ్జ గణపయ్య

25-09-2026 | 10:30pm

* నిమజ్జనంలో ప్రత్యేక ఆకర్షణగా కళాకారుల నృత్య ప్రదర్శన

* వెళ్లిరా బొజ్జ గణపయ్య.. మళ్లీ రావయ్యా.. అంటూ ఘనంగా వీడ్కోలు

పాపన్నపేట,సెప్టెంబర్25: : పాపన్నపేట మండలం(Papannapet Mandal) వ్యాప్తంగా ఆయా గ్రామాల్లోని మండపాల్లో కొలువుదీరిన బొజ్జ గణపయ్య శుక్రవారం గంగమ్మ ఒడికి చేరుకున్నారు. 11 రోజులపాటు ఘనంగా పూజలు నిర్వహించి చివరి రోజు అంగరంగ వైభవంగా నిమజ్జన శోభాయాత్రలు(Immersion Processions) నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గంగమ్మ ఒడికి చేర్చారు.

పాపన్నపేటలోని నవయువ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిమజ్జన శోభాయాత్రలో కళాకారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. నెహ్రూ ప్రాంతం భక్తులతో భక్తజన సంద్రంగా మారింది. వెళ్లిరా బొజ్జ గణపయ్య.. మళ్లీ రావయ్యా.. అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు