గణేష్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం యువకుడు

25-09-2026 | 10:37pm

బోథ్ సెప్టెంబర్ 25 ( విజయక్రాంతి): సోనాల మండల(Sonala Mandal) కేంద్రంలో వివేకానంద యూత్(Vivekananda Youth) వారు ప్రతిష్టాపించిన గణేష్ మండపం వద్ద శుక్రవారం లడ్డూ వేలం పాట నిర్వహించారు. వేలంపాటలో అదే గ్రామానికి చెందిన ఎస్కే సద్దాం(SK Saddam) అనే ముస్లిం యువకుడు(Muslim youth) వేలం పాట పాడి 22,500 కు గణేష్ లడ్డూను(Ganesh Laddu) దక్కించుకున్నారు. అంతకుముందు ముస్లిం యువకులంతా గణేష్ మండపం వద్దకు చేరి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మతసామరస్యానికి నిలువుటద్దంగా గ్రామ యువకులు కులమతాలకతీతంగా ఉండడం ఆదర్శనీయమని పలువురు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు