అక్రమ క్లినిక్‌ల అధికారుల తనిఖీ

19-09-2026 | 10:18pm

​హత్నూర: హత్నూర మండలం(hathnoora mandal)లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆర్‌ఎంపీ క్లినిక్‌ల(RMP clinics)పై అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 19న ‘విజయక్రాంతి’ దినపత్రికలో ప్రచురితమైన “సీజ్ చేసినా మారట్లే?” శీర్షికన వచ్చిన ప్రత్యేక కథనానికి జిల్లా వైద్యారోగ్య శాఖ (District Medical and Health Department) స్పందించింది. ​డీఎంహెచ్‌ఓ ఆదేశాల మేరకు హత్నూర పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రజిని శనివారం స్థానిక క్లినిక్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆర్‌ఎంపీలు బీపీ అపారేటస్, స్టెతస్కోప్‌లను ఉపయోగించవద్దని ఆదేశిస్తూ వాటిని స్వాధీనం చేసుకున్నారు. క్లినిక్‌లలో బెడ్లు తొలగించాలని, నిబంధనలకు విరుద్ధంగా మందులు, ఇంజెక్షన్లు ఇస్తూ ప్రైవేట్ ఆసుపత్రుల తరహాలో వైద్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేవలం ప్రథమ చికిత్సకే పరిమితం కావాలని, ఉల్లంఘిస్తే క్లినిక్‌లను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు