మద్యం మత్తు.. ఓ ప్రాణం బలి
22-09-2026 | 12:23pm
మద్యం మత్తులో ఘర్షణ
కత్తిపోట్లతో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) కేంద్రంలో కత్తిపోట్ల కలకలం చెలరేగింది. మద్యం మత్తులో ముగ్గురి మధ్య గొడవ జరగడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానిక సితార థియేటర్ సమీపంలోని జలాల్బాగ్ ఓపెన్ గ్రౌండ్లో ఈ ఘటన జరిగింది. గొడవలో భాగంగా కత్తులతో దాడికి పాల్పడడంతో పాజిల్ (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బిలాల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా ఘటనలో పాలుపంచుకున్న కంది గ్రామానికి చెందిన రహీం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.