రోగి భద్రత అనేది ఉమ్మడి బాధ్యత

20-09-2026 | 05:00am

నిమ్స్ డైరెక్టర్ రాల్ దేవజ్

పంజాగుట్ట,సెప్టెంబర్ 19(విజయక్రాంతి): రోగి భద్రత(Patient Safety) అనేది ఉమ్మడి బాధ్యతని నిమ్స్(NIMS) డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్(Rahul Devaraj) అన్నారు.అందుకోసం వైద్యులు, ఫార్మసిసు ్టలు, నర్సింగ్ సిబ్బందితో(Doctors, pharmacists, nursing staff) పాటు రోగులు ప్రజలంతా పరస్పర సహకారంతో సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చా రు. జాతీయ ఫార్మాకోవిజిలెన్స్ వారోత్సవా ల్లో భాగంగా నిమ్స్ లో శనివారం ఫార్మాకోవిజిలెన్స్ అవగాహన ర్యాలీని(Pharmacovigilance Awareness Rally) శనివారం నిర్వహించారు.

ఫార్మాకోవిజిలెన్స్ ప్రొగ్రాం ఆఫ్ ఇండియ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రజలు మందులను స్వయంగా వినియోగించకుండా,అర్హత కలిగిన వైద్యుల సలహా, ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే తీసుకోవాలని సూచించారు.మందుల వినియోగంలో సరైన మందు, సరైన మోతాదు,మోతాదు ఇచ్చే సమయం,సరిగ్గా ఉపయోగించడం వంటి అంశాలు ఎంతో ముఖ్యమని వివరించారు.

అర్హత కలిగిన ఫార్మసిస్టులు వైద్యుల ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులను అందించడం, వాటి సురక్షిత వినియోగంపై అవ సరమైన సమాచారం, సూచనలు ఇవ్వడం ద్వారా ఔషధ భద్రతలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు.అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు ఫార్మాకోవిజిలెన్స్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఫార్మా కోవిజిలెన్స్ ద్వారా మందుల హేతుబద్ధ వినియోగాన్ని ప్రోత్సహించడం -సురక్షితమైన ఆరోగ్య సంరక్షణ వైపు ఒక ముందడుగు అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని వివరించారు.

నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్లినికల్ ఫార్మకాలజీ విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఫార్మాకోవిజిలెన్స్ ద్వారా మందుల హేతుబద్ధ వినియోగాన్ని ప్రోత్సహించడం,మందుల భద్రతపై అవగాహన కల్పించడం,రోగుల భద్రతను మెరుగుపరచడం ర్యాలీ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో నిమ్స్ డీన్ డాక్టర్ పి.చంద్రశేఖర్,ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డాక్టర్ పరంజ్యోతి,డిప్యూటీ మెడికల్ సూపరిటిండెంట్ డాక్టర్ కృష్ణారెడ్డి,క్లినికల్ ఫార్మకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి,మెడికల్ అంకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మెహర్ లక్ష్మి,ఎమర్జెన్సీ విభాగం ప్రొపెసర్ డాక్టర్ సునీల్, పీవీ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ పద్మజ,అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీనివాస్ జి,డాక్టర్ మాధవి,రెసిడెంట్ వైద్యులు,నర్సింగ్ సిబ్బంది,వైద్యులు,అధ్యాపకులు,వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు